Header Banner

మెగాస్టార్ చిరంజీవితో సినిమా.. ఆస్తులు అడుగుతున్న స్టార్ హీరోయిన్! భయపడుతున్న నిర్మాతలు!

  Tue May 06, 2025 11:54        Entertainment

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నయనతార పారితోషికం మరోసారి వార్తల్లో నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాలుగా కథానాయికగా కొనసాగుతున్న ఆమె, తాజాగా ఒక తెలుగు సినిమా కోసం ఏకంగా రూ.18 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించేందుకు నయనతార ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నయనతార ఇటీవలి కాలంలో నటించిన 'అన్నపూరిణి', 'టెస్ట్' వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. వ్యక్తిగత జీవితంలో పెళ్లి, కవల పిల్లలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తాజా పరిణామం సూచిస్తోంది. బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌తో కలిసి నటించిన 'జవాన్' చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం, ఆ సినిమాకు ఆమె రూ.12 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని వార్తలు రావడం తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

ఈ విజయం తర్వాత నయనతార తన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పారితోషికం పెంచారని భావిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఓ భారీ బడ్జెట్ సినిమా కోసం నిర్మాతలు నయనతారను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు గాను ఆమె రూ.18 కోట్లు డిమాండ్ చేశారని, ఈ విషయంపై ప్రస్తుతం నిర్మాతల బృందం ఆమెతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమై, నిర్మాతలు ఆమె డిమాండ్‌కు అంగీకరిస్తే, దక్షిణాది సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నయనతార సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయం. ఇదివరకే నయనతార, చిరంజీవితో కలిసి 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్‌ఫాదర్' చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మూడోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుందా, నయనతార డిమాండ్ చేసిన పారితోషికానికి నిర్మాతలు అంగీకరిస్తారా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అయితే, ఈ పారితోషికం వార్త మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Nayanthara #VigneshSivan #Divorce #Rumours #Kollywood #Tollywood #Actors